మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (21:45 IST)

బాబొచ్చాడు - జాబెక్కడ వచ్చింది - చెవిలో పువ్వుతో రోజా నిరసన(వీడియో)

చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబొస్తే జాబొస్తుందని టిడిపి నేతలు ప్రగల్భాలు పలికారని, అయితే ఎక్కడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదంటూ రోజా చెవిలో

చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబొస్తే జాబొస్తుందని టిడిపి నేతలు ప్రగల్భాలు పలికారని, అయితే ఎక్కడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదంటూ రోజా చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన చేపట్టారు. పుత్తూరులోని టవర్ క్లాక్ నుంచి నిరుద్యోగులతో కలిసి రోజా ర్యాలీని నిర్వహించారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరం దాటుతున్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని రోజా ఆరోపించారు. ఉన్నత చదువులు చదివి చాలామంది నిరుద్యోగులు ఇప్పటికీ ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిరుద్యోగ భృతితో పాటు నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటుని రోజా డిమాండ్ చేశారు.