శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (16:35 IST)

దుబాయ్‌లో నన్నెవరూ ఏమీ చేయలేదంటున్న రోజా

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో పర్యటిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన రోజా ఎంజాయ్ చేస్తోంది. అయితే దుబాయ్‌లో ఉన్న వైసిపి కార్యకర్తలు, నాయకుల కోరికతో ఒక సమావేశంతో పాల్గొంది.

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దుబాయ్‌లో పర్యటిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిన రోజా ఎంజాయ్ చేస్తోంది. అయితే దుబాయ్‌లో ఉన్న వైసిపి కార్యకర్తలు, నాయకుల కోరికతో ఒక సమావేశంతో పాల్గొంది. 2 వేల మంది వైసిపి కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌లో 10 మంది ఒక చోట కలిసి ఉండకూడదు. అలాంటి 2 వేల మంది ఒకే ప్రాంతంలో ఉండటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
 
అందరూ వెళ్ళిపోవాలంటూ పోలీసులు చెప్పారు. రోజాను కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే కొన్ని ఛానళ్ళలో రోజా‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో రోజా తన వాట్సాప్ ద్వారా ఒక వీడియో మెసేజ్‌ను పంపింది. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని చెప్పారు. దుబాయ్‌లో వైసిపి కార్యకర్తలు, నాయకుల మీటింగ్ బాగా జరిగిందని అందులో పేర్కొన్నారు.