శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Mohan
Last Modified: శుక్రవారం, 14 జులై 2017 (18:33 IST)

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు 'జబర్దస్త్‌' ఆర్టిస్ట్‌లు సంభాషణలు రాసిస్తున్నారా?

రోజా అంటే పరిచయం అవసరం లేని సెలెబ్రిటీ. ఒకవైపు సినిమాలలో తనదైన ముద్ర వేసారు. మరోవైపు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ, ఆంధ్ర రాష్ట్రంలోని సమస్యలపై తనదైన గొంతుకను వినిపిస్తున్నారు. ఇప్పుడు రోజా పార్టీ మీటింగ్‌లు, ప్రచారాలలో మాట్లాడే భాష చూస్తుంటే అవతలి వ

రోజా అంటే పరిచయం అవసరం లేని సెలెబ్రిటీ. ఒకవైపు సినిమాలలో తనదైన ముద్ర వేసారు. మరోవైపు రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ, ఆంధ్ర రాష్ట్రంలోని సమస్యలపై తనదైన గొంతుకను వినిపిస్తున్నారు. ఇప్పుడు రోజా పార్టీ మీటింగ్‌లు, ప్రచారాలలో మాట్లాడే భాష చూస్తుంటే అవతలి వారికి పంచ్‌ల మీద పంచ్‌లు గుప్పిస్తున్నారు. ఇలా మాట్లాడుతుంటే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో నటులు ఎలా పంచ్‌లు వేస్తున్నారో గుర్తుచేస్తోంది. 
 
మొన్న జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలలో రోజా తన ప్రసంగంతో హోరెత్తించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో ప్రసంగాన్ని సాగించిన రోజా గుక్కతిప్పుకోకుండా మాట్లాడి తెదేపా నాయకులందరినీ ఏకిపారేశారు. ఇక రాష్ట్ర సమస్యలను ఏకరువు పెట్టారు. అవి కాస్తా ఆటంబాంబులా పేలి, ప్లీనరీకి వచ్చిన వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. తాను మాట్లాడిన తీరు చూస్తే ఎవరో ఆ సంభాషణలను రాసిచ్చినట్లు అనిపిస్తోంది. ఏమో ఆ ప్రసంగం వెనుక ఎవరి స్క్రిప్ట్ వర్క్ దాగున్నదో కానీ ఇప్పుడు రోజా మరింత పదునైన ప్రసంగాలతో పార్టీ సమావేశాలలో తనదైన ఫైర్‌బ్రాండ్ శైలితో దూసుకుపోతున్నారు.