సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:04 IST)

గానగంధర్వుడు ఎస్పీబీకి ఏమైంది? సోషల్ మీడియాలో వదంతులు! (Video)

తెలుగు చిత్ర పరిశ్రమ నేపథ్యగాయకుడు, గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం అరోగ్యం పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎస్పీబీ స్పందించారు. తన ఆరోగ్యం బాగుండలేదంటూ వస్తున్న వదంతులను నమ్మొద్

తెలుగు చిత్ర పరిశ్రమ నేపథ్యగాయకుడు, గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం అరోగ్యం పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎస్పీబీ స్పందించారు. తన ఆరోగ్యం బాగుండలేదంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన శ్రేయోభిలాషుల నుంచి తనకు పరామర్శలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. 
 
ఆరోగ్యం బాగుండని కారణంగా ప్రదర్శనలు రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందని తన శ్రేయోభిలాషులు చెప్పారని అన్నారు. దగ్గు, జలుబు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే తన ఆరోగ్యం బాగుండలేదని భావించి ఉంటారని అన్నారు. అలాగే, తన ప్రదర్శనల రద్దుకు కారణం.. తన సోదరి గిరిజ కన్నుమూయడమేనని, దాదాపు 12 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిందని అన్నారు. 
 
ఈ సంఘటన తర్వాత సెప్టెంబరు 2న బెంగళూరులో ప్రదర్శన ఇచ్చానని, ప్రస్తుతం ‘స్వరాభిషేకం’ షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్టు చెప్పారు. తన ఆరోగ్యంపై వదంతులు సృష్టించి, ఎందుకు బాధ కల్గిస్తారో అర్థం కావడం లేదన్నారు. దయచేసి ఇలాంటి వందతులు నమ్మొద్దని ఆయన కోరారు. అలాగే, నెటిజన్లకు కూడా ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు పోస్ట్ చేసి సమాజంలో అలజడి సృష్టించవద్దని ఆయన కోరారు.