శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 19 మే 2017 (13:33 IST)

రోజాకు రైతు స్పెల్లింగ్ తెలియదు... సోమిరెడ్డి ఎద్దేవా...

రైతు స్పెల్లింగ్ తెలియని ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తనకు తెలిసి రోజా పొలానికి వెళ్లి ఉండదన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో ఆమె చెప్పడం దారుణమన్నారు. మిర్చి కొనుగోలుప

రైతు స్పెల్లింగ్ తెలియని ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తనకు తెలిసి రోజా పొలానికి వెళ్లి ఉండదన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో ఆమె చెప్పడం దారుణమన్నారు. మిర్చి కొనుగోలుపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి అవగాహన లేదని అన్నారు. 
 
ప్రతి యేటా గుంటూరు మిర్చి యార్డులో హమాలీలకు, గుమస్తాలకు 40 రోజుల సెలవులిస్తారన్నారు. ఇది ఎప్పటి నుంచో సాగుతుందన్నారు. తామేమీ కొత్తగా వారికి సెలవులు ఇవ్వడంలేదని మంత్రి తెలిపారు. ఇటీవల హమాలీలతో సమావేశం నిర్వహించి, మానవత్వంతో రైతులకు సహకరించాలని ప్రభుత్వం తరఫున కోరామన్నారు. తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి హమాలీలు, గుమస్తాలు మిర్చి కొనుగోలుకు సహకరిస్తురన్నారు. ఇవేమీ తెలియని జగన్ తమను విమర్శించడం తగదన్నారు.