1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (22:32 IST)

మోదీది అవినీతి రహిత పాలన: కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు జిల్లా కొరిటపాడు హనుమయ్య నగర్లో భారతీయ జనతా పార్టీ సంకల్పించిన 'జన జాగరణ' కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. 
 
రెండవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. గడిచిన సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు.
 
నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన చేస్తూ, గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ప్రశంసించారు. 
 
దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీరును భారత రాజ్యాంగంలో భాగస్వామ్యం చేశారని, త్రిబుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, రామమందిరం నిర్మాణం లాంటి జఠిలమైన సమస్యలను పరిష్కరించారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 
 
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముందు చూపుతో లాక్ డౌన్ ద్వారా ప్రజలను సురక్షితంగా రక్షించారని, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు అండగా నిలిచారని,లాక్ డౌన్ అనంతరం అందరూ తిరిగి వ్యాపారాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారని, వివిధ మాధ్యమాల ద్వారా మోడీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘునాధ్ బాబు మరియు రాష్ట్ర, స్థానిక  బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.