1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (13:01 IST)

'పక్కా సమాచారంతోనే స్కెచ్'... గ్యాంగ్‌స్టర్ నేర చరిత్ర ఇదీ... ఐఎస్ఐఎస్‌తో లింకులు!

గ్యాంగ్‌స్టర్ నయీంను పక్కా సమాచారంతోనే గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకున్నట్టు తమకు పక్క

గ్యాంగ్‌స్టర్ నయీంను పక్కా సమాచారంతోనే గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకున్నట్టు తమకు పక్కా సమాచారం వచ్చిందన్నారు. దీంతో మిలీనియం టౌన్ షిప్‌లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్‌మెన్ ముందుగా కాల్పులు జరిపాడని, ఆ తర్వాత గ్రేహౌ్ండ్స్ దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమైనట్టు ఆయన తెలిపారు. 
 
నిజానికి నయీంపై కొద్దిరోజులుగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిసారించాయి. నయీంను టార్గెట్ చేయాల్సిందిగా పెద్దల నుంచి పోలీసులకు సమాచారం అందింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నయీంపై ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్ పోలీసులు ఎటాక్ చేశారు. నయీంపై పెద్ద నేరచరిత్రే ఉంది. పటోళ్ల గోవదర్థన్‌రెడ్డితో పాటు.. ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో నయీమ్ ప్రధాన నిందితుడు. 
 
పలు భూదందాలు, సెటిల్‌మెంట్లలో సైతం అతడి ప్రమేయం ఉంది. యాంటీ మావోయిస్టు గ్యాంగ్‌ను తయారు చేసిన నయీం మాజీ మావోయిస్టు సాంబశివుడు, అతడి సోదరుడు రాములు హత్య కేసులో సైతం ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నారు. నయీంపై దాదాపు 100కుపైగా కేసులు ఉన్నాయి. పౌరహక్కుల నేత పురుషోత్తం, రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత టీఆర్ఎస్ నాయకుడు కే.సాంబశివుడు, ప్రజాగాయకురాలు బెల్లి లలిత హత్యకేసుల్లోనూ నయీమ్ ప్రధాన సూత్రధారి. లలితను దారుణంగా హత్య చేసిన నయీం ఆమెను 18 ముక్కలు చేసి ఒక్కోచోట పడేశాడు. 2001లో నయీమ్ చివరిసారి అరెస్ట్ అయ్యాడు. నయీం స్వస్థలం నల్గొండ జిల్లా భువనగిరి. 
 
అంతేకాకుండా, అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కడా బయటకు రాకుండా నయీం నేరాలు చేయించే స్టైల్ ఆ తర్వాత సదరు నిందితులు అరెస్ట్ అయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటుంది. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయారు. సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 
 
ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు చేధించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు. అందుకే ఏ కేసులోనూ నయీమ్ వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాదు. సంచలనాత్మక హత్య జరిగిన ప్రతీసారి అదీ నయీమ్ పనేనని ప్రకటించే పోలీసులు అతన్ని పట్టుకోవడంలో మాత్రం విఫలమవుతుంటారు.