గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (09:34 IST)

భర్త లేడు.. సహజీవనం చేసింది.. పిల్లలకు ఉరేసింది.. ఎక్కడ?

భర్త లేడు.. సహజీవనం చేసినా ఫలితం లేదు. అంతే ఏమనుకుందో ఏమో కానీ ఆ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి హత్య చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌నగర్‌లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు ఒక కూతురు చిన్మయి(8), ఒక కుమారుడు మోహిత్‌(6) ఉన్నారు. 13 ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవిస్తోంది. 
 
అలాగే కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఆమె తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
అయితే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక చంపేశానని అనూష చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూష తరచూ పిల్లలను కొడుతుండేదని తెలిసింది. దాంతో ఆమె తల్లి కనకదుర్గ ఒకసారి ఆమెను మందలించగా అందుకు తల్లిపై కూడా అనూష దాడి చేసిందని తెలిసింది.