శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (14:53 IST)

కందిరీగలు కుట్టడంతో తల్లీకూతుళ్లు దుర్మరణం... ఎక్కడ?

తల్లీకూతుళ్లు కందిరీగలు కుట్టడంతో దుర్మరణం చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ.. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. చండీఘడ్‌లోని పీజీఐ హాస్పిటల్‌లో విద్యాదేవీ.. అంజన కుమారీ చికిత్స పొందారు. గడ్డి తీసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన వాళ్లిద్దరూ తిరిగి వస్తుండగా కందిరీగల గుంపు వారిని దారుణంగా కుట్టాయి. 
 
అది విని పరిగెత్తుకుని వచ్చిన స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తాండా మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసినప్పటికీ చండీఘడ్‌కు తరలించాలని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలో సాధారణ జీతానికి పనిచేస్తున్న బాధితురాలి భర్త ట్రీట్మెంట్ కోసం డబ్బులు సమకూర్చలేకపోయాడు. ఇద్దరు కొడుకుల తల్లి అయిన మహిళ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. పంచాయతీ చీఫ్ లతా కుమారీ చాలా పేదరికానికి చెందిన యువతి అని చెబుతున్నారు.