సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (11:10 IST)

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కులాంతర వివాహం చేసుకుందనీ...

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కులాంతర వివాహం చేసుకుందనీ ఓ తల్లి అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఎల్బీనగర్ ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె కులాంతర వివాహం చేసుకుందనీ ఓ తల్లి అర్థాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఎల్బీనగర్ ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పుష్ప (45) అనే మహిళ భర్త చనిపోవడంతో తన ఒక్కగానొక్క కుమార్తె పూజితతో కలిసి జీవిస్తోంది. 
 
అష్టకష్టాలు పడి కుమార్తెను డిప్లొమా వరకు చదివించింది. అయితే, 8 నెలల క్రితం ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఓ ముస్లిం యువకుడిని ప్రేమించిన పూజిత అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్లింది. వారం రోజుల క్రితం పూజిత తన భర్తతో కలిసి తల్లిని చూసేందుకు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సదరు యువకుడిని వదిలి తనతోనే ఉండాలని కూతురు పూజితను తల్లి కోరింది. దీంతో ఈనెల 15న పూజిత తన భర్తతో కలిసి ఎన్టీఆర్‌నగర్ నుంచి వెళ్లి పోయింది.
 
తాను చెప్పిన మాట కుమార్తె పెడచెవిన పెట్టడంతో పుష్ప తీవ్ర మనోవేదనకు గురైంది. జీవితంలో ఒంటరి దానిని అయిపోయానన్న వేదనతో ఉదయం 7 గంటల సమయంలో రేకుల గదిలో ఇనుపకడ్డీకి చున్నీతో ఉరివేసుకొని పుష్ప ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పుష్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. దీనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.