గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (09:59 IST)

మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం.. బక్రీద్ రోజున హిందూ వృద్ధురాలికి కర్మకాండలు

బక్రీద్ పండగ రోజున పలువురు ముస్లిం సోదరుడు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఓ హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

బక్రీద్ పండగ రోజున పలువురు ముస్లిం సోదరుడు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఓ హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కాజీపేటలో బొందమ్మ అనే 80 యేళ్ల వృద్ధురాలు ఉంది. ఈమెకు నా అనేవారు ఎవ్వరూలేదు. గతంలో వరంగల్ గిర్మాజీపేటలో, ఆ తర్వాత హన్మకొండలో కుమార్‌పల్లిలో తన భర్తతో కలసి ఇస్త్రీషాపు నడుపుకొంటూ జీవిస్తూ వచ్చింది. ఈ క్రమంలో భర్త 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఎలాగోలా ఇస్త్రీ షాపుతో బతుకుతున్న ఆమెకు 6 ఏళ్ల క్రితం నుంచి కాలు విరగడంతో అనారోగ్యానికి గురైంది. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన బొందమ్మ పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకుడు చోటు ఆమె బంధువులకు తెలిపాడు. వారంతా ఆశ్రమానికి వచ్చి బొందమ్మ మృతదేహాన్ని చూసి వెళ్లిపోయారు.. కానీ, ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 
 
దీంతో ఇంతకాలం తన ఆశ్రమంలోనే ఆశ్రయం పొందిన బొందమ్మకు అన్నీ తానే అయిన ఆశ్రమ నిర్వాహకుడు చోటు.. మంగళవారం బక్రీద్ రోజున ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా, ఆశ్రమ నిర్వాహకుడు చోటు ముస్లిం అయినప్పటికీ.. బక్రీద్ పర్వదినాన పెద్ద మనస్సుతో హిందూ అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి, మానవత్వానికి మతం లేదని నిరూపించాడని స్థానికులు కొనియాడారు.