బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 14 మార్చి 2017 (16:55 IST)

పీఆర్పీని వాళ్లలా వాడుకున్నారు... చిరంజీవి జనసేనలోకి రారు.. పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ స్థాపించి మూడేళ్లు నిండిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మీడియాతో ముచ్చటించారు. జనసేన పార్టీకి వెన్నుదన్నుగా వున్న అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో 30కి పైగా వున్న అంశాలను గుర్తించామనీ, వాటన్నిటిపైనా

జనసేన పార్టీ స్థాపించి మూడేళ్లు నిండిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మీడియాతో ముచ్చటించారు. జనసేన పార్టీకి వెన్నుదన్నుగా వున్న అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో 30కి పైగా వున్న అంశాలను గుర్తించామనీ, వాటన్నిటిపైనా చర్చించి వాటి పట్ల జనసేన విధానాలను పొందుపరుస్తామని తెలిపారు. జనసేన వెబ్ సైటును కూడా ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జనసేన పార్టీలోకి అన్నయ్య చిరంజీవి వస్తారనే ప్రచారం జరుగుతోందన్న దానిపై మాట్లాడుతూ... చిరంజీవి గారి భావాలు వేరు తన భావాలు వేరని, అందువల్ల ఆయన తన పార్టీలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. 
 
జనసేనలో నాయకులను ఎందుకు చేర్చుకోవడంలేదన్న ప్రశ్నపై స్పందిస్తూ... గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలోకి వచ్చినవారు ఎవరికివారు వ్యక్తిగత ఎజెండాలతో వచ్చారని అన్నారు. అలాంటి పరిస్థితి జనసేనలో పునరావృతం కాకుండా కాపు కాయాల్సిన బాధ్యత తనపై వున్నదన్నారు. అందుకే జనసేన పార్టీలో యువతకు 60 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
 
జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోనూ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం... అక్కడ కేసీఆర్ తెరాసకు ప్రజలు పూర్తి మద్దతి ఇచ్చినప్పుడు తను పోటీ చేయడం కరెక్టు కాదని వదిలేసినట్లు చెప్పారు. ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు పాలసీలు ఏమిటో తనకు తెలుసుననీ, కాకపోతే ఆ పాలసీలన్నీ ప్రజల వద్దకు చేరడం లేదన్న అనుమానం వుందన్నారు.