ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 25 జనవరి 2017 (07:06 IST)

మోదీకి సాధ్యం కానిది.. చంద్రబాబుకే సాధ్యమైనది ఏంటబ్బా?

చంద్రబాబు ఇటీవలే స్విట్జర్లండ్ లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని వచ్చారు. అక్కడ దేశదేశాల ప్రతినిధులతో తన చర్చల గురించి మీడియాతో పంచుకున్నారు. ఎంత ఘనంగా అంటే ఇండియా అంటే ఆంధ్రప్రదేశే అనేంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏపీ గురించి తెల

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇంకా నిర్మించని దాని రాజధాని గురించి పూర్తిగా తెలుసుకున్నాయట. ఇండియా, దాని రాజధాని ఢిల్లీ కూడా అంతగా వారికి తెలీదట. వినడానికే ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ నమ్మాల్సిందే మరి. ఇలా చెప్పింది సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారే మరి.
చంద్రబాబు ఇటీవలే స్విట్జర్లండ్ లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని వచ్చారు. అక్కడ దేశదేశాల ప్రతినిధులతో తన చర్చల గురించి మీడియాతో పంచుకున్నారు. ఎంత ఘనంగా అంటే ఇండియా అంటే ఆంధ్రప్రదేశే అనేంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏపీ గురించి తెలుసుకునేశారట.
 
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత్ ఒక దేశంగా విఫలమైన చోట బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడంలో తను సక్సెస్  అయినట్లు చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే... ఇండియా ఒక దేశంగా సాధించలేనిది ఆంద్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా సాదించింది. దావోస్‌లో అంతర్జాతీయ సంస్థలతో 50 ద్వైపాక్షిక సమావేశాలను నేను నిర్వహించాను. అనేక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ షాపులను ఏర్పర్చేందుకు ఆసక్తి చూపించాయి అన్నారు బాబు. 
 
అనేక దేశాలతో సాంకేతిక నైపుణ్యాలను పంచుకుంటానని తను ప్రతిపాదించానని బాబు చెప్పారు. శ్రీలంకలో ఒక పారిశ్రామిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడంలో ఏపీ ఆ దేశానికి సాయపడుతుందని, ఆవిధంగా మన రాష్టంలోని పరిశ్రమలు అక్కడ తమ యూనిట్లను ఏర్పర్చుకోవచ్చని చంద్రబాబు వివరించారు.
 
కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రపంచానికంతటికీ తెలిసిన రాష్టం అయిందన్నమాట అని బాబు స్పష్టం చేశారు. ఇండియాలో ఏపీ ఒక బ్రాండ్ అయితే సంతోషించదగినదే కదా. కాని ఇవి వాగ్దానాలుగా, హామీలుగా మిగలిపోకూడదనేదే ప్రజల ఆకాంక్ష.