ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (12:40 IST)

11న మాజీ సీఎం కిరణ్‌ హైదరాబాద్‌కు.. అనుచరులతో భేటీ...?

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత కొన్నిరోజులకు పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరమైపోయారు. చిత్తూరు జిల్లా కలికిరి ప్రాంతానికి కిరణ్‌ కుమ

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత కొన్నిరోజులకు పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరమైపోయారు. చిత్తూరు జిల్లా కలికిరి ప్రాంతానికి కిరణ్‌ కుమార్ రెడ్డికి జాక్‌పాట్‌లాగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ హయాంలో లభించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ సమైక్యాంధ్ర ఉద్యమంలో అయితే రాష్ట్రంగా రెండుగా విడిపోయిందే అదే పేరుతో పార్టీని స్థాపించారు కిరణ్‌. కానీ ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో ఇక చేసేదిలేక సైలెంట్ అయిపోయారు.
 
కానీ గత కొన్నినెలలుగా కిరణ్‌ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న తన అనుచరులు, సన్నిహితులతో రెండు, మూడు సమావేశమయ్యారు. ఒకసారి వైకాపా, మరోసారి జనసేనలోకి ఇలా రకరకాల నిర్ణయం తీసుకుని మళ్ళీ వెనక్కి తగ్గి.. ఇక వచ్చిన పార్టీలోకి మళ్ళీ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో ఢిల్లీ రాజకీయాలను శాసించేందుకు ఏకంగా రాహుల్ గాంధీనే కలిసి తన మనసులోని మాటలను బయట పెట్టాడు. 
 
ప్రస్తుతం కిరణ్‌ కుమార్ రెడ్డి బెంగుళూరులో ఉన్నారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ కు రానున్న తన అనుచరులతో మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, మాజీ మంత్రులతో సమావేశమవుతున్నారట. సమావేశానికి సంబంధించిన ఆహ్వానాన్ని కూడా ఇప్పటికే అందరికీ పంపించేశారట. అయితే ఈసారి కిరణ్‌ కుమార్ రెడ్డి తీసుకునే నిర్ణయానికైనా కట్టుబడి ఉంటారా అన్న అనుమానాలను ఆయన అనుచరులే వ్యక్తం చేస్తున్నారు.