శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (19:05 IST)

నాంపల్లి అత్యాచారం కేసు.. పదేళ్లు జైలు.. లక్ష జరిమానా

నాంపల్లి అత్యాచారం కేసులో కోర్టు పదేళ్లు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో నిందితుడు గట్టు రాజేందర్‌కు నాంపల్లి కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 
 
సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లికి చెందిన వాస్తు నిపుణుడు, సివిల్ కాంట్రాక్టర్ గట్టు రాజేందర్ 2012లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.