శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (15:11 IST)

పెద్ద నోట్ల రద్దుతో ఇంటి అద్దె కట్టలేక పోతున్నా : నన్నపనేని రాజకుమారి

పెద్ద నోట్ల రద్దుతో ఇంటి అద్దె కూడా చెల్లించలేక పోతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసు

పెద్ద నోట్ల రద్దుతో ఇంటి అద్దె కూడా చెల్లించలేక పోతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ఆమె స్పందించారు. పెద్ద నోట్లు రద్దుతో ఇంటి అద్దె కట్టలేకపోతున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
కేంద్రం పాత నోట్లను రద్దు చేయడంతో అందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు. మహిళలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారని, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నోట్ల రద్దుపై కేంద్రం దూకుడుగా నిర్ణయం తీసుకుందని ఆమె కేంద్రంపై తీవ్రంగా మండింది. కొందరు నల్లకుబేరుల కోసం అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని, కొత్తగా రూ.2 వేల నోటును తేవడం అనాలోచిత నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.