ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (10:38 IST)

పేద విద్యార్థులకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ : నారా భువనేశ్వరి

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని ఎన్టీఆర్‌లా సమాజాభివృద్ధికి ఉపయోగపడి గొప్ప నాయకులుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ ఆదర్శ పాఠశాలలో రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి స్పందిస్తూ, ప్రతిభ గల పేద విద్యార్థులకు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేని చిన్నారుల అభివృద్ధికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అండగా ఉంటుందన్నారు. 
 
రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 250 మంది విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో అవకాశాలను సద్వినియోగపర్చుకుని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. కాగా, నారా భువనేశ్వరి ఈ ట్రస్ట్‌కు ఓ ట్రస్టీగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.