సీఎం జగన్ - ఎన్. రామ్... వీరిద్దరి మధ్య అంత ప్రేమెందుకు?

n ram - jagan
ఠాగూర్| Last Updated: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (10:11 IST)
- jagan
జగన్ నివాసానికి వెళ్లారు. అక్కడే అల్పాహారం తీసుకున్న తర్వాత జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే కారులో బయల్దేరారు. సాధారణంగా కారులో ముందు సీట్లో కూర్చునే జగన్... రామ్ తో కలిసి వెనక సీట్లో కూర్చోవడం గమనార్హం.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ది హిందూ గ్రూపు సంస్థల ఛైర్మన్ ఎన్. రామ్ ప్రత్యేక ప్రేమను చూపుతున్నారు. జగన్ కూడా రామ్ పట్ల వీర వినయ విధేయతను ప్రదర్శిస్తున్నారు. జయవాడలోని గేట్ వే హోటల్ లో జరిగిన 'ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్' కార్యక్రమం సందర్భంగా ఈ విషయం తేటతెల్లమైంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్. రామ్ బుధవారం చెన్నై నుంచి విజయవాడకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన నేరుగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, అక్కడే అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి నేరుగా కార్యక్రమం జరిగే హోటల్‌కు చేరుకున్నారు.

దీనిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. 'హిందూ గ్రూప్ ఛైర్మన్ ఎన్.రామ్‌‌గారికి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్‌గారిపై ప్రత్యేక అభిమానం. కారణాలేంటో వారి ఇరువురికే తెలియాలి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని బీరాలు పలికే రామ్‌గారికి ఈ అవినీతి కనిపిస్తున్నట్టు లేదు' అని ట్వీట్ చేశారు.

కాగా, తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన రామ్‌.. సీఎంతో కలిసి టిఫన్ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకే కారులో బయల్దేరారు. సాధారణంగా కారులో ముందు సీట్లో కూర్చునే జగన్... రామ్‌తో కలిసి వెనక సీట్లో కూర్చోవడం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :