Nara Lokesh : చదువు రాజకీయాలకు దూరంగా వుండాలి.. జీవితాన్ని పరీక్షగా తీసుకోండి: నారా లోకేష్
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం.
అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించాం. సమానత్వం అనేది విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి. పుస్తకాల్లో ఆటలకు మగ బొమ్మలు, ఇంటి పనులకు ఆడ బొమ్మలు ఉంటాయి.
పాఠ్యపుస్తకాల్లోని ఈ అసమానతలను తొలగించాలని ఆదేశించాను. చదువు రాజకీయాలకు దూరంగా ఉండాలని నారా లోకేష్ పునరుద్ఘాటించారు. అలాగే, పుస్తకాల్లో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సహా రాజకీయ నేతల చిత్రాలు ఉండకూడదని ఆదేశించారు. అన్ని పుస్తకాల నుంచి పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించింది.
రాజకీయ నేతలు పార్టీ రంగులు, కండువాలు ధరించి వెళ్లవద్దని లోకేష్ ఆదేశించారు. పాఠశాలల వద్ద పార్టీ రంగుల్లో పాఠశాలలకు ఎలాంటి అలంకరణలు ఉండకూడదని ఆదేశించారు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ఆయన తన ప్రసంగాలన్నింటిలో వీలైన చోటల్లా నారా లోకేష్ మాట్లాడుతున్నారు.