మంగళవారం, 11 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 మార్చి 2025 (21:51 IST)

మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ గుడ్ న్యూస్, 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితం

2 electric buses are free
ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎయిమ్స్, పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చిందనీ, అందువల్ల మెగా ఇంజినీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి తన విజ్ఞప్తి మేరకు 2 ఎలక్ట్రిక్ బస్సులు ఉచితంగా అందించినట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
 
'' ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించాను. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. నా విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి రూ.2.4 కోట్ల విలువైన రెండు ఒలెక్ట్రా బస్సులను ఉచితంగా అందించింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు, మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తాయి.''