మంత్రులను నిలబెట్టి నారా లోకేష్... అందరిపై గ్రిప్... ఇక స్టాండప్ పొజిషనే!
విజయవాడ : తెలుగుదేశం యువ కిరణం లోకేష్ అనతి కాలం లోనే టీడీపీపై పట్టు పెంచేశారు. కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి... కిందస్థాయిలో గ్రిప్ సంపాదించిన లోకేష్... ఇపుడు మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలను సైతం లోకేష్ తన గ్రిప్ లోకి తె
విజయవాడ : తెలుగుదేశం యువ కిరణం లోకేష్ అనతి కాలం లోనే టీడీపీపై పట్టు పెంచేశారు. కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి... కిందస్థాయిలో గ్రిప్ సంపాదించిన లోకేష్... ఇపుడు మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలను సైతం లోకేష్ తన గ్రిప్ లోకి తెచ్చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని కె.ఎల్. యూనివర్సిటీలో నిర్వహించిన తెలుగుదేశం వర్క్ షాపులో ఇలా... హోం మంత్రిని సైతం లోకేష్ నిలబెట్టి మరీ క్లాసులు ఇచ్చారు.
దీనితో ఇక అంతా చినబాబు జమానా అంటూ, తెలుగుదేశం సీనియర్ నేతలు పెదవి విరస్తున్నారు. తనను రాజ్యాంగేతర శక్తిగా కొందరు అభివర్ణిస్తున్నారని, పార్టీ కోసం అకుంఠిత దీక్షతో పనిచేయడమే తప్పాఅన్నట్లు లోకేష్ అందరికీ క్లాస్ తీసుకున్నారు. ఏవో కొన్ని అవాతంరాల వల్ల తాను మంత్రి కాలేకపోయాయని, త్వరలో అదీ పొంది... రాజ్యాంగ శక్తిగానే మీ ముందుకు వస్తాననే కాన్పిడెన్స్ లోకేష్ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇపుడు లోకేష్ ముద్ర టీడీపీలో బలంగా కనిపిస్తోంది. కింద స్థాయి నుంచి, పై స్థాయి వరకు అందరూ ఇపుడు లోకేష్ తో టచ్ లో ఉండటం తప్పనిసరిగా మారిందని సీనియర్ టీడీపీ నాయకుడొకరు సెలవిచ్చారు