శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (10:44 IST)

కార్య‌క‌ర్త‌ల కోసం స్టేష‌నుకి వ‌స్తే... చదలవాడ అరవింద బాబు అరెస్ట్!

నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాక్ట‌ర్ చదలవాడ అరవింద బాబు అరెస్ట్ అయ్యారు. ఆయ‌న‌తోపాటు పాలపాడుకు చెందిన టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా టిడిపి కార్యకర్తలను స్టేషన్లోనే ఉంచారు. టిడిపి కార్యకర్తలను విడిచి పెట్టాలని స్టేషన్ కు వెళ్లిన డా౹౹చదలవాడను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
త‌మ కార్య‌కర్త‌ల‌ను విడిపించాల‌ని చ‌ద‌ల‌వాడ ఎంత చెప్పినా పోలీసులు స్పందించకపోవడంతో, ఆయ‌న స్టేషన్ ఎదుట భైఠాయించారు. దీనితో బలవంతంగా అరవింద బాబును అరెస్టు చేసిన పోలీసులు ఆయ‌న్ని స్టేషన్లోకి లాక్కొని తీసుకెళ్ళారు. ఈ అరెస్ట్ సందర్భంగా ఇరువురి మ‌ధ్య తీవ్ర తోపులాటలు జ‌రిగాయి.

పోలీసుల తీరుపై స్టేషన్లో అర‌వింద‌బాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలను విడిచిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని ఆయ‌న భీష్మించుకుని కూర్చున్నారు. దీనితో అర‌వింద‌బాబుకు మ‌ద్ద‌తుగా స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్య లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.