మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:58 IST)

ఎయిర్ పోర్ట్ లో క‌లిసిన టీడీపీ బృందం; సాయంత్రం టైం ఇచ్చిన ఎస్సీ కమిషన్

గుంటూరులో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌ కమిషన్‌ అధికారులను గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లోనే కలిశారు.

ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్‌ సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అనంతరం కమిషన్ బృందం గుంటూరు బయల్దేరింది.

అంతక ముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందానికి పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, గన్నవరం డీటీ శ్రీనివాసరావు, భాజపా ముఖ్య నాయకులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.