బద్వేల్ ఉప ఎన్నిక బరిలో బీజేపీ నేతల విస్తృత ప్రచారం
బద్వేల్ ఉప ఎన్నిక విచిత్రంగా మారింది. ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు ఈ ఎన్నిక నుంచి విరమిస్తున్నామని, సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య బరిలో ఉండటంతో, ఆ సెంటిమెంట్ ని గౌరవించి తాము పక్కకు తప్పుకొంటున్నట్లు నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించారు. అయితే, తాము మాత్రం తగ్గేదేలా అంటూ, జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ బద్వేల్ బరిలో వైసీపీ అభ్యర్థినితో ఢీ అంటున్నాయి.
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ చురుకుగా పాల్గొంటోంది. శనివారం ఉదయం ఎంపీ సీఎం రమేష్ బద్వేల్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాము బద్వేల్ లో మంచి అభ్యర్తిని తమ పార్టీ తరుపున నిలబట్టామని, కాంగ్రెస్ , వైసీపీలను నమ్మే పరిస్తితుల్లో బద్వేల్ ప్రజలు లేరని చెప్పారు.
బద్వేల్ లో జరుగుతున్నల్యాండ్ మాపియాపై కోర్టుకు వెళ్లి పోరాడతామని సీఎం రమేష్ చెప్పారు. అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని, అప్పు చేసి తెచ్చిన సొమ్మును ఏం చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలే బద్వేల్ ఉప ఎన్నికల్లో మా ప్రచారాస్త్రాలని ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.