ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (14:33 IST)

చంద్రబాబును నక్సల్స్ చంపేస్తారు... భద్రతను పెంచండి : హోంశాఖ ఆదేశాలు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చంపేందుకు మావోయిస్టులు కుట్రపన్నారని, అందువల్ల ఆయనకు భద్రతను పెంచాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చంపేందుకు మావోయిస్టులు కుట్రపన్నారని, అందువల్ల ఆయనకు భద్రతను పెంచాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఎన్.ఎస్.జి భద్రతకుతోడు అదనంగా మరో మరికొంతమంది సెక్యూరిటీ గార్డులను కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం చంద్రబాబుకు ఎన్.ఎస్.జి బృందంతో మూడంచెల భద్రత కొనసాగుతోంది. ఈ భద్రతను ఇపుడు ఐదు అంచెలకు పెంచి.. అదనంగా మరో ఎన్ఎస్‌జి బృందాన్ని కూడా హోంశాఖ కేటాయించింది.
 
కాగా, చంద్రబాబును హత్య చేసేందుకు మావోయిస్టులు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్న విషయం తెల్సిందే. అలిపిరి దాడి నుంచి చంద్రబాబ తృటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు భద్రతను పెంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును నక్సల్స్ టార్గెట్ చేశారు. ఆయన తరచుగా ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వద్ద కూడా మావోలు రెక్కీ నిర్వహించినట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించి హోంశాఖను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతను పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.