నెల్లూరు మేకల జత ధర రూ.1.50 లక్షలు

goats
ఠాగూర్| Last Updated: గురువారం, 22 జులై 2021 (11:53 IST)
బక్రీద్ పండుగను పురస్కరించుకుని మేకలు వేలం వేయగా, ఇందులో నెల్లూరు మేకలకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఒక జత మేకలకను లక్ష యాభై వేల రూపాయలు పలికాయి. నెల్లూరు జిల్లా సంతపేటలో ఈ మేకల వేలం జరిగింది.

ఈ సంతలో వేలూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూర్‌, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మేకలను వేలం వేస్తుంటారు. ప్రతి వారం ఈ వేలం పాటలు జరుగుతుంటాయి. రాష్ట్రానికి చెందిన మేకల జత రూ.50 వేల వరకు విక్రయం కాగా, నెల్లూరుకు చెందిన మేకల జత రూ.1.50 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

ఈ విషయమై నెల్లూరు వ్యాపారులు మాట్లాడుతూ, నెల్లూరు తెల్లరకం మేక బరువు 25 కిలోలు వుంటుందని, మాంసం కోసమే ఈ మేకల్ని సంరక్షిస్తున్నామన్నారు. ఈ రకం మాంసం రుచి కూడా బాగుండడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారని తెలిపారు.

కాగా, రాణిపేట, వేలూరు, తిరుపత్తూర్‌ జిల్లాల్లో రెండు రోజులుగా సుమారు 20 ప్రాంతాల్లో నిర్వహించిన మేకల సంతలో రూ.25 కోట్ల విక్రయాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :