మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:56 IST)

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్త్రీ జననాంగాలు, గర్భసంచి..!

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిఫుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్సను చేశారు. నియోజకవర్గానికి చె

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్సను చేశారు. నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి హెర్నియా ఆపరేషన్ కోసం మూడు రోజుల క్రితం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. డాక్టర్లు అతనికి గురువారం హెర్నియా ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆయన కడుపులో స్త్రీలకు సంబంధించిన జననాంగాలు, గర్భసంచి ఉండడం చూసి షాక్ అయ్యారు. దాంతో డాక్టర్లు వాటిని తొలగించి ఆపరేషన్ పూర్తి చేశారు.
 
ఈ సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెన్నయ్య, శస్త్రచికిత్స నిఫుణుడు డాక్టర్‌ గోపి మాట్లాడుతూ పురుషుల్లో స్త్రీ జననాంగాలు ఉండడం అరుదైన విషయమన్నారు. ఆయనలో వీటిని తొలగించకపోతే క్యాన్సర్‌ సోకే అవకాశాలు ఉండేవని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన ఆరోగ్యం కోలుకుంటుందని వైద్యులు చెప్తున్నారు.