గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (10:24 IST)

నెల్లూరులో కిడ్నాప్ ఘటన.. మాజీ జెడ్పీసీ సోదరుడి కిడ్నాప్

నెల్లూరులో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. జిల్లాలో మాజీ జెడ్పీసీఈఓ ఈఓ సుబ్రహ్మణ్యం సోదరుడి కిడ్నాప్‌కు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. తన సోదరుడు గోపాలకృష్ణను కిడ్నాప్ చేశారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు.
 
తాను నివాసం ఉంటున్న పుత్తూరు నుంచి కిడ్నాప్ చేసి వెంకటగిరికి తీసుకువచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటగిరి ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి వెంకటేశ్వర్లుపైన ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
 
కిడ్నాప్‌కు ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు తెలిపారు. వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన వెంకటగిరి పోలీసులు.. పుత్తూరు పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.