గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 26 ఆగస్టు 2021 (17:14 IST)

తిరుమ‌ల వెంక‌టేశునికి మ‌హింద్రా సిఇఓ జీపు విరాళం!

ఎవ‌రి వ‌ద్ద ఏదుంటే అది శ్రీవారికి కానుక‌గా స‌మ‌ర్పించ‌డం తిరుమ‌ల‌లో ఆన‌వాయితీ... కొంద‌రు డ‌బ్బు ముడుపుగా క‌డ‌తారు. కొంద‌రు బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు ఇస్తారు. కొంద‌రు దేముడికి నిలువు దోపిడీ ఇస్తారు.  

అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ‌ సిఈవో దిలీప్ గురువారం రూ.16 ల‌క్ష‌లు విలువైన మ‌హేంద్ర థార్ జీపును టిటిడికి విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి, వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. జీపు తాళాల‌ను టిటిడికి అప్ప‌గించారు.

ఈ భ‌క్తుడి జీపు విరాళాన్ని తిరుమ‌ల‌లో ఇత‌ర భ‌క్తులు ఆస‌క్తిగా తిల‌కించారు. ఎర్ర‌ని రంగులో మెరిసిపోతున్న ఈ జీపును అంద‌రూ వింత‌లా చూస్తున్నారు. స్వామి వారి అవ‌స‌రాల‌కు ఈ జీపును వినియోగిస్తామ‌ని టిటిడి అధికారులు చెపుతున్నారు.