శనివారం, 9 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2025 (11:30 IST)

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

Shiva Kandukuri, Rajiv Kanakala
Shiva Kandukuri, Rajiv Kanakala
యాక్టర్ శివ కందుకూరి ఎప్పుడూ కూడా డిఫరెంట్ స్టోరీలతో ప్రయోగాలు చేస్తుంటారు. ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు వీలున్న కథల్ని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో శివ కందుకూరి హీరోగా ‘#చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు.
 
‘#చాయ్ వాలా’ నుంచి శుక్రవారం (ఆగస్ట్ 8) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై అలా జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు. చూస్తుంటే అది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వారిద్దరి నవ్వుల్ని చూస్తుంటే ఆడియెన్స్‌ ఇట్టే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
 
‘ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుంది. భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. టీజర్ అతి త్వరలో వస్తుంది’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ నర్వా ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.