మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:25 IST)

ఆంధ్రప్రదేశ్‌లో మారనున్న పాఠశాలల స్వరూపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జాతీయ విధానం అమలుకు ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులోభాగంగా, ఏపీలో ప్రభుత్వ బ‌డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. వ‌చ్చే నెలలో 3 నుంచి 5 త‌ర‌గ‌తుల‌ను హైస్కూల్లో విలీనం చేయనున్నారు. దీంతో తమ ఇళ్లకు, తమ గ్రామానికి సమీపంలో ఉన్న అనేక బడులు మాయంకానున్నాయి. 
 
కొత్త విధానంతో స‌ర్కారీ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానాన్ని ఏపీ ప్రభుత్వం అమ‌ల్లోకి తీసుకురానుంది. వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో అమ‌ల్లోకి రాబోతుంది. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఫలితంగా ఇప్పటివ‌ర‌కూ ఉన్న ప్రైమ‌రీ, అప్పర్ ప్రైమ‌రీ, హైస్కూల్ విధానానికి బ‌దులు కొత్త విధానం అమ‌ల్లోకి వ‌స్తుంది.