యువతిని బెదిరించి ఐదు నెలలుగా అత్యాచారం
తెలంగాణ రాష్ట్రంలో 19 యేళ్ళ యువతి అత్యాచారానికి గురైంది. ఈ బాధిత యువతిని బెదిరిస్తూ ఐదు నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోధన్ పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఒంటరిగా ఉండేది. ఇది గమనించిన యువతి ఇంటి సమీపంలోనే నివసించే ఆమె పెదనాన్న కుమారుడు నవీన్ (25), స్నేహితుడు రవి (22)తో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు.
ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం వెళ్లగా, వారు పారిపోయారు.