శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 5 జులై 2017 (18:20 IST)

కూరగాయల ధరల పెరుగుదలకు... జీఎస్టీకి సంబంధం లేదు... యనమల

అమరావతి : జీఎస్టీపై కొంతమంది ఇంకా అపోహలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ అనేది ఇప్పటికే 164 దేశాల్లో అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభు

అమరావతి : జీఎస్టీపై కొంతమంది ఇంకా అపోహలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ అనేది ఇప్పటికే 164 దేశాల్లో అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఈ చట్టం తెచ్చింది కాదని, గత 14 సంవత్సరాలుగా దీనిపై చర్చ నడుస్తున్నదని మంత్రి గుర్తు చేశారు. ఒక కొత్త చట్టం అమల్లోకి తెచ్చినప్పుడు ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, అయితే జీఎస్టీ కౌన్సిల్ ప్రతి నెల సమావేశమై జీఎస్టీ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి పరిష్కరిస్తుందన్నారు.
 
అన్ని రాష్ట్రాలు జీఎస్టీని ఆమోదించాయని జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారన్నారు. జీఎస్టీ అమల్లోకి రావడం వల్ల ఎరువులపై పన్ను తగ్గిందన్నారు. జిఎస్టీ కారణంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జీఎస్టీ కౌన్సిల్ కృషి చేస్తుందన్నారు. జీఎస్టీ  అమల్లోకి రావడం వల్ల తాత్కలికంగా ఇబ్బందులు ఉన్నా, దీర్ఘకాలంలో లాభాలు ఉంటాయని తెలిపారు. సామాన్యులపై భారం పడకుండా  కొన్ని వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారన్నారు. 
 
సామాన్యులకి ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే.. ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరిస్తామని తెలిపారు. జీఎస్టీతో దేశమంతా ఒకే పన్ను విధానముంటుందని, దానివల్ల పారిశ్రామిక వృద్ధి పెరుగుతుందని తెలిపారు. జీఎస్టీ రాకతో చెక్ పోస్టుల అవసరం లేకుండా పోయిందన్నారు. సినిమాల విషయంలో ప్రాంతీయ సినిమాలకు ఒక విధంగా, జాతీయ సినిమాలకు మరో విధంగా  ట్యాక్స్ విధించడం జరుగుతోందని...  ప్రస్తుతం 100 రూపాయల లోపు టికెట్‌కు జీఎస్టీ మినహాయింపు ఉందని.. రూ.100 పైన టిక్కెట్లపై జీఎస్టీ పన్ను ఉంటుందన్నారు. 
 
అలాగే ఆలయాల్లో స్వామి వారి ప్రసాదాలు, వాటికి ఉపయోగించే సామగ్రిపై పన్ను మినహాయించారని, తిరుమలలో 500, 1000 రూపాయల గదులపైనా జీఎస్టీ మినహాయింపు ఉందన్నారు. జీఎస్టీ వల్ల రూ. 2900 కోట్ల నష్టం రాష్ట్రానికి వస్తుందన్నారు. ప్రతి ఏటా వాణిజ్య పన్నుల వసూళ్లు రూ. 34 వేల కోట్ల రూపాయలుగా ఉందన్నారు. కూరగాయల ధరల పెరుగుదలకు జీఎస్టీకి సంబంధం లేదన్నారు. జీఎస్టీ మన దేశంలో అమలు చేయడం ఇంకా ఆలస్యం జరిగిందని మంత్రి యనమల అన్నారు.