ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (20:02 IST)

ఈశాన్య రుతుపవనాలు-తిరుమల కొండను తాకిన మేఘాలు.. (video)

tirumala
తిరుపతి నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. మాండూస్ తుఫాను ఎఫెక్టుతో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు మదనపల్లి, రాయచోటి ప్రాంతం వరకు విస్తరించాయి. ఆపై అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఈ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కొండపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. 
 
తిరుపతి నగరంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కనిపించింది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల కొండలపై మేఘాలు అలా ఎగురుకుంటూ పోతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వెంకన్న కొండను మేఘాలు తాకి చూసేలా వున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.