గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 14 మే 2018 (20:20 IST)

చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చాడు.. ఐదేళ్ళ చిన్నారిని రెండునెలలు అనుభవించాడు..

చిత్తూరు జిల్లాలో మరో దాచేపల్లి సంఘటన జరిగింది. ఐదేళ్ళ చిన్నారిపై రెండునెలల పాటు అత్యాచారం చేశాడు 65 ఏళ్ల వృద్ధుడు. చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ప్రతిరోజూ పంచాయతీ భవనంపైకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని చిన్నారిపై రె

చిత్తూరు జిల్లాలో మరో దాచేపల్లి సంఘటన జరిగింది. ఐదేళ్ళ చిన్నారిపై రెండునెలల పాటు అత్యాచారం చేశాడు 65 ఏళ్ల వృద్ధుడు. చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ప్రతిరోజూ పంచాయతీ భవనంపైకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని చిన్నారిపై రెండు నెలల పాటు లైంగిక దాడి చేశాడు. జరిగిన విషయాన్ని స్థానికులు తెలుసుకుని వృద్ధుడికి దేహశుద్థి చేశారు.
 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లిలో నివాసముంటున్న ఐదేళ్ళ చిన్నారి కావ్యను గత రెండు నెలల నుంచి సుబ్బయ్యనాయుడు అనే వృద్థుడు లైంగికంగా అనుభవించాడు. స్థానికంగా ఉన్న పంచాయతీ భవనంపైకి చిన్నారిని ఎత్తుకెళ్ళి చాక్లెట్లు, బిస్కెట్లు చూపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తెలిసిన వ్యక్తే కదా అని చిన్నారి కూడా వృద్ధుడితో కలిసి వెళ్ళింది. 
 
చిన్నారిని ఎత్తుకెళ్ళేటప్పుడు గ్రామస్తులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. వృద్థుడు కదా అనుకున్న స్థానికులు అలాంటిదేమీ పట్టించుకోలేదు. చివరకు స్థానికులు చిన్నారిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ప్రత్యక్షంగా గమనించి వృద్థుడిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పజెప్పారు. వృద్థుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.