శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2016 (14:09 IST)

విశాఖలో ఒడిస్సా తరహా ఘటన.. నాలుగేళ్ల బిడ్డ శవాన్ని చేతులో పెట్టుకుని 3 కిలోమీటర్లు..?

ఒడిస్సాలో ఆంబులెన్స్‌లో భార్య శవాన్ని తీసుకెళ్లలేని ఓ వ్యక్తి యూపీలో తన భుజంపై శవాన్ని వేసుకుని కిలోమీటర్ల మేర నడిచిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. విశాఖ ఏజెన్సీలో చేతులో బిడ్డ.. కళ

ఒడిస్సాలో ఆంబులెన్స్‌లో భార్య శవాన్ని తీసుకెళ్లలేని ఓ వ్యక్తి యూపీలో తన భుజంపై శవాన్ని వేసుకుని కిలోమీటర్ల మేర నడిచిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. విశాఖ ఏజెన్సీలో చేతులో బిడ్డ.. కళ్ల నిండా కన్నీళ్లు, కాళ్లు తడబాటుతో ఓ తండ్రి నరకవేదన అనుభవించాడు. విశాఖ, పాడేరు, పంచాయతీ పోతురాజుమెట్ట ప్రాంతంలో శనివారం ఈ ఘటన స్థానికులను కలచివేసింది. 
 
ప్రాణాలు కోల్పోయిన తన నాలుగేళ్ల బిడ్డను మూటగట్టుకుని చేతులో పెట్టుకుని కిలోమీటర్ల మేర ఆ తండ్రి నడిచాడు. వివరాల్లోకి వెళితే.. పోతురాజుమెట్ట గ్రామానికి చెందిన కొర్రా కొండన్న పేద తండ్రి. ఆయన నాలుగేళ్ల కుమార్తె సంధ్య శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. పంట సంజీవని పథకం కింద తవ్విన పంట కుంటలో పడి చనిపోయింది. ప్రమాద మరణాలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. 
 
కానీ ఇందుకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆ మరణాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దానికోసం 12 కిలోమీటర్ల దూరంలోని పాడేరు మండల కేంద్రానికి పోవాల్సి వుంది. దీంతో పాడేరుకు కొండన్న నడుచుకుంటూ పోయాడు.
 
నిజానికి, కేసు నమోదు అయితే, పోలీసులే దగ్గరుండి పోస్టుమార్టం జరిపించాలి. మరి ఏమయిందో తెలియదుగానీ, సంధ్య మృతదేహాన్ని తెల్లగుట్టలో చుట్టుకొని కొండన్న పాడేరుకు కాలినడకన బయలుదేరాడు. మూడు కిలోమీటర్లు నడిచాడు. అక్కడ ఆయన బంధువు కలిసి, తన తన బైకు మీద కొండన్నను పాడేరు దాకా తీసుకెళ్లాడు. పాడేరు ఆస్పత్రిలో బిడ్డకు పోస్టుమార్టం పూర్తి అయ్యాక, పోలీసులు ఏర్పాటుచేసిన వాహనంలో గ్రామానికి తిరిగి వచ్చాడు.