మందుకొట్టి చిందేసిన ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసు
వైకాపా నేతలతో కలిసి మందేసి చిందేసిన ఎమ్మార్వోకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తేరుకోలేని షాకిచ్చారు. వైకాపా నేతల మందు పార్టీలో పాల్గొన్నందుకుగాను వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసును జారీచేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వోగా నరసింహమూర్తి ఉన్నారు. ఇటీవల వైకాపా నేతలంతా కలిసి ఓ తోటలో పెట్టుకున్న మందుపార్టీలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈయనతో పాటు ఉద్యోగులతో మందు పార్టీ చేసుకుని ఆ తర్వాత వైసీపీ నేతలతో కలసి డ్యాన్స్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో నరసింహమూర్తికి పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.