సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2024 (19:56 IST)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Pawan kalyan
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీడియాతో అల్లు అర్జున్ ఘటనపై స్పందించారు. పుష్ప2 సినిమా తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వస్తున్నారని సమాచారం ఉన్నా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పు, బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే నిర్ణయం సరైనది కాకపోవచ్చునని చెప్పారు. 
 
తాను కూడా పుష్ప 2 సినిమాకు వెళ్లాను కానీ అభిమానుల హడావుడి వలన సినిమా చూడలేకపోయానని.. ఒకరిని ఒకరు తప్పు పట్టడం కన్నా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే మంచిది అని అన్నారు. అలాగే.. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. 
 
తెలంగాణ తరహాలోనే ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పుడు చాలా రద్దీ అయింది. ఇలాంటి సమయంలో ఇంకోచోట డెవలప్ జరిగితే బాగుంటుంది. ఇక్కడికి కూడా సినీ పరిశ్రమ వస్తే ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా ఎంప్లొయీమెంట్ జరుగుతుంది. మా ఉపముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా పరిగణించాలని కోరుకుంటున్నానని తెలిపారు. దీంతో పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.