బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2024 (18:15 IST)

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

Mohanlal as director
Mohanlal as director
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ 'బరోజ్ 3డీ'. ఈ ఎపిక్‌ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరుంబవూర్‌ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సినిమాపై అంచనాలు పెంచాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ ఆన్ లైన్ లో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
Mohanlal as Artist
Mohanlal as Artist
బరోజ్ జర్నీ ఎలా మొదలైయింది ?
-బరోజ్ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్ లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్ గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్ తో పాటు స్టొరీ టెల్లింగ్ ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా వుంటుంది.  
 
ఈ కథకు స్ఫూర్తి ఉందా ?
-గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్‌, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా వుంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త వుంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్ తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.
 
త్రీడీ సినిమా నిర్మించడంలో ఎదురుకున్న సవాళ్ళు ?
-త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమరాలు అవసరం పడతాయి. అన్ని కెమరాల విజన్ పర్ఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ప్రేక్షకడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
 
తొలిసారి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?
-ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం.  
 
-టాప్ లెన్స్ మ్యాన్ సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. విజువల్స్ ప్రేక్షకుడికి  చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా వుంటుంది. దీని కోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేశారు
 
-పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని చేశాం. గత నలభై ఏళ్ళుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు.
 
-మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది.  
 
-ఆడియన్స్ థియేటర్స్ లో ఓ న్యూ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారనే నమ్మకం వుంది. తప్పకుండా సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది.