కుమార్తె పెళ్లిపై గొడవ.. పోటీపడి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
కన్నబిడ్డ వివాహంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామానికి చెం
కన్నబిడ్డ వివాహంపై భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామానికి చెందిన రాజన్న, అతని భార్య మంజుల (37) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె ప్రేమావతి పెళ్లి విషయంపై భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రేమావతిని తమ బంధువుల ఇవ్వాలని మంజుల పట్టుబట్టింది. మరో రెండేళ్ల వరకు పెళ్లి ప్రస్తావనే వద్దని రాజన్న ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్నహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త రాజన్న తానూ చనిపోతానని ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుమారై కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మంజుల మృతిచెందగా రాజన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.