శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (16:46 IST)

పవన్‌కు ఆ పవర్ వుంది కానీ... ఆయన భవిష్యత్ పైన నేను మాట్లాడను... సుమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో తరచూ చర్చల్లోకి వస్తున్న నాయకుడు. సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే చాలు... పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఎలా వుంటుందని అడగటం ఎక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో తరచూ చర్చల్లోకి వస్తున్న నాయకుడు. సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే చాలు... పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఎలా వుంటుందని అడగటం ఎక్కువైంది. తాజాగా సీనియర్ నటుడు సుమన్ తను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పలు విషయాలపై సుమన్ మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవష్యత్ గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి.
 
దీని గురించి సుమన్ మాట్లాడుతూ... పవన్‌ లాంటి యువ నాయకుడు సమాజానికి ఉపయోగపడే ఆలోచనలతో ముందుకు రావాలనీ, పవన్ కళ్యాణ్  ప్రస్తావిస్తున్న సమస్యలను ఇప్పటివరకూ ఇతర నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారనీ, ఆయనకు ఆ పవర్ వుందని, ఐతే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో రాజకీయాల్లో రాణిస్తారా లేదా అన్నది తను ప్రస్తావించనని వెల్లడించారు. సుమన్ మాటలను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతారా లేదంటే ఎదగలేరనా అనే సందేహాలను అక్కడున్నవారు చెప్పుకున్నారు.