శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (09:46 IST)

పవన్ కళ్యాణ్‌ రహస్యంగా భేటీ అయిన ఆ 25 మంది పెద్దలు ఎవరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చడీచప్పుడుకాకుండా తన పార్టీని విస్తరిస్తున్నారు. ఇందులోభాగంగా, 25 మంది ప్రముఖులతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారట. ఈ విషయం తాజాగా బయటకు పొక్కింది. దీంతో పవన్ భేటీ అయిన ఆ 25

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చడీచప్పుడుకాకుండా తన పార్టీని విస్తరిస్తున్నారు. ఇందులోభాగంగా, 25 మంది ప్రముఖులతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారట. ఈ విషయం తాజాగా బయటకు పొక్కింది. దీంతో పవన్ భేటీ అయిన ఆ 25 మంది ప్రముఖుల పేర్లను జనసేన త్వరలోనే వెల్లడించనుంది. 
 
ఇదే విషయంపై జనసేన అధికార ప్రతినిధిగా చలావణి అవుతున్న కళ్యాణ్ దిలీప్ స్పందిస్తూ, సమయం, సందర్భాన్ని బట్టి ఆ 25 మంది పేర్లను పవన్ బయటపెడతారని వివరించారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ముందుకు వెళ్లే ఉద్దేశం పవన్‌కు లేదన్నారు. 
 
మూడేళ్ల క్రితమే జనసేన నియామకాలు జరిగాయన్నారు. ఈ నియామకాల్లో భాగంగా, తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, మీడియా చీఫ్‌గా హరిప్రసాద్ ఉన్నారన్నారు. అదేసమయంలో మరో నెల రోజుల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.