గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (19:26 IST)

ఆ బిల్లుకు మోక్షం కలిగిన నాడే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు : పవన్ కళ్యాణ్

మహిళా బిల్లు పార్లమెంటును దాటి రావాలని, ఆ బిల్లుకు మోక్షం కలిగిననాడే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టవుతుందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల

మహిళా బిల్లు పార్లమెంటును దాటి రావాలని, ఆ బిల్లుకు మోక్షం కలిగిననాడే మహిళలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టవుతుందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. మహిళలకు వారి సమాన హక్కులు లభించి వారికి న్యాయం జరగాల్సి ఉందన్నారు. అర్థరాత్రి కూడా ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరగగలిగే పరిస్థితి ఏర్పడాలని పవన్ కోరారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో... 
 
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత" అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతులు కొలువుంటారని మన పూర్వీకులు చెపుతుండేవారు. ప్రస్తుతం ఈ ఆధునికకాలంలో వారికి పూజలు చేయలేక పోయినా వారేమి బాధపడరు. వారు ఎపుడు బాధపడతారంటే వారికి కనీస గౌరవం ఇవ్వనప్పుడు, సమాన అవకాశాలు కల్పించలేనపుడు, నిర్భయంగా తిరగలేనపుడు మన ఆడపడుచులు తీవ్రంగా వ్యధ చెందుతారు. ఒకప్పుడు భారతీయ సమాజాంలో స్త్రీకి ఎంతో విలువ ఉండేది. అది క్రమక్రంగా క్షీణించి పోయింది. 
 
ఈ ప్రాభవాన్ని మళ్లీ మనమందరం పునర్జీవింపచేద్ధాం. మహిళ దినోత్సవాలను మాటలతో చేయడం కాదు.. చేతల్లో చూపుదాం. మన ఆడపడుచులు తలెత్తుకుని బతికేలా వారికి సమాన అవకాశాలు కల్పిద్దాం. ఎన్నో సంవత్సరాలుగా పార్లమెంట్‌ను దాటి బయటకు రాని మహిళా బిల్లుకు మోక్షం కల్పిద్దాం. భ్రూణ హత్యలను అరికట్టి ఆడబిడ్డలను సంరక్షించుకున్నపుడే భారత జాతి సుసంపన్నంగా శోభిల్లుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లోని సోదరీమణుల అందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున సోదరపూర్వక శుభాకాంక్షలు" అంటూ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.