శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (14:09 IST)

నోట్లు మార్చుకునే పనిలో పవన్ కల్యాణ్: సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్...

పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు ఇబ్బందులు పడుతున్నారు. నల్లధనంపై చెక్‌కు పెద్ద నోట్లను ప్రధాని మోడీ రద్దు చేసిన తరుణంలో.. సెలబ్రిటీలు బ్యాంక్ క్యూలైన్లలో నిల్చుంటున్నారు. మొ

పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీల వరకు ఇబ్బందులు పడుతున్నారు. నల్లధనంపై చెక్‌కు పెద్ద నోట్లను ప్రధాని మోడీ రద్దు చేసిన తరుణంలో.. సెలబ్రిటీలు బ్యాంక్ క్యూలైన్లలో నిల్చుంటున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏటీఎం వద్ద నిల్చుని సామాన్య ప్రజలతో పాటు నోట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మోడీపై నిప్పులు చెరిగారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు నానా తంటాలు పడుతున్నారని చెప్పారు. ఇక పెద్ద నోట్లు రద్దు అనేది ఒక వ్యక్తి ఆలోచన ఆధారంగా చేసిన చర్య అని, ఇదొక భారీ కుంభకోణంగా మారవొచ్చని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 
తాజాగా టాలీవుడ్ సెలెబ్రిటీ, పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నోట్లను మార్పు చేసుకునే పనిలో పడ్డారు. బుధవారం పవన్ కల్యాణ్ నోట్లు మార్చేందుకు హైదరాబాద్ సిటీలోని ఓ బ్యాంక్‌కి వచ్చారు. ఇటు పవన్‌ని బ్యాంకు వద్ద చూడగానే అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. చివరకు కారులో పవన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.