గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (11:19 IST)

భుజం నొప్పి అని వస్తే వైద్యులు ప్రాణం తీశారట... ఎక్కడ?

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. భుజం నొప్పి అని వస్తే ఏకంగా ప్రాణం తీశారని బంధువులు ఆరోపిస్తున్నారు. బౌరంపేటకు చెందిన నజీర్ అనె (40) వ్యక్తి సోమవారం సూరారంలోని నారాయణ హృదయాల

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. భుజం నొప్పి అని వస్తే ఏకంగా ప్రాణం తీశారని బంధువులు ఆరోపిస్తున్నారు. బౌరంపేటకు చెందిన నజీర్ అనె (40) వ్యక్తి సోమవారం సూరారంలోని నారాయణ హృదయాలయకు భుజం నొప్పితో నడుచుకుంటూ వచ్చి ఆసుపత్రిలో చేరాడు.
 
తీరా మధ్యాహ్నానికి డాక్టర్లు సీరియస్ అని చెప్పి, మృతి చెందాడని మంగళవారం రాత్రి చెప్పడంతో కోపోద్రిక్తులైన మృతుని బంధువులు ఫర్నీచర్ ద్వంసం చేసి ఆసుపత్రి అద్దాలు పగుల గొట్టారు. భుజం నొప్పి అని వస్తే వైద్యులు ప్రాణం తీశారని వాపోతున్నారు.