శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (09:04 IST)

అమ్మాయిలకు తొందరెక్కువ... డేటింగ్ కోసం షార్ట్‌కట్స్...

పెళ్లికి ముందే ముద్దూముచ్చట తీర్చుకునేందుకు అబ్బాయిల కంటే అమ్మాయిలే తొందరపడుతున్నారు. ముఖ్యంగా, డేటింగ్ కోసం, డేటింగ్ టిప్స్ కోసం షార్ట్‌కట్స్‌ను కూడా ఫాలో అవుతున్నారు. ప్రధానంగా, డేటింగ్ టిప్స్ కోసం

పెళ్లికి ముందే ముద్దూముచ్చట తీర్చుకునేందుకు అబ్బాయిల కంటే అమ్మాయిలే తొందరపడుతున్నారు. ముఖ్యంగా, డేటింగ్ కోసం, డేటింగ్ టిప్స్ కోసం షార్ట్‌కట్స్‌ను కూడా ఫాలో అవుతున్నారు. ప్రధానంగా, డేటింగ్ టిప్స్ కోసం పలు యాప్‌లతోనే సమయాన్నంతా గడిపేస్తున్నారట.
 
నార్వేజియన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన కొంత మంది ప్రొఫెసర్లు ఈ డేటింగ్‌ ట్రెండ్‌ ఎలా ఉందో 19-29 ఏళ్ల వయసున్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలను ఆరా తీశారు. ఇందులో ఎక్కువ మంది అమ్మాయిలు టిండర్ యాప్‌ను ఉపయోగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
టిండర్‌ యాప్‌ను ఉపయోగించడంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ముందున్నారట. దీన్ని ఉపయోగించే అమ్మాయిలైతే ఎదుటివారి వ్యక్తిగత, వృత్తిగత నేపథ్యాన్ని బాగాక్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటున్నారు. కష్టమైనా, నష్టమైనా దానికే కట్టుబడుతున్నారు. అందుకే 'టిండర్'లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ సేపు గడుపుతున్నారట.
 
ఇక అబ్బాయిల విషయానికొస్తే, ఇదంతా రివర్స్‌. ఎదుటివారి గురించి ఓ అంచనా వేయడానికీ, ఒకేసారి ఎక్కువ మందిని పరిచయం చేసుకోవడానికీ వారి అంత టైమ్‌ తీసుకోవడం లేదట. ఎప్పుడెప్పుడు కలుద్దామనే ఆరాటంలో ఉంటారట. కేవలం స్వల్పకాలిక అనుబంధాల కోసం, శారీరక అవసరాల కోసం ఈ యాప్‌ను వాడే అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారని తేలింది. అందుకే ఒకరు నచ్చకపోతే మరొకరు... అబ్బాయిలు తమ ఇష్టాలను ఈజీగా షిఫ్ట్‌ చేసుకుంటున్నారట. చెప్పాలంటే ప్లేబోయ్‌లా మారిపోతున్నారు.