గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (12:05 IST)

కీరాను తీసుకుంటే కీళ్లనొప్పుల నుంచి తప్పించుకోవచ్చు...

సాధారణంగా కలిపించే కీరాలో అసాధారణ గుణాలు ఉన్నాయి. కీరాలో శరీరానికి కావలసిన అనేక విటమిన్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి లతో పాటు పోటాషియం, మెగ్నిషియం, సిలికాన్ వంటి పోషక పదార్ధాలు ఉన్నాయి. బరువు త

కీరాలో అసాధారణ గుణాలు ఉన్నాయి. కీరాలో శరీరానికి కావలసిన అనేక విటమిన్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి లతో పాటు పోటాషియం, మెగ్నిషియం, సిలికాన్ వంటి పోషక పదార్ధాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారికి కీరా ఒక అద్భుత వరం. రక్తపోటును సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.
 
మన శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. శరీరానికి నీరు సమృద్ధిగా అందకపోవడం వలన డిహైడ్రేషన్‌కు గురి అయ్యే ప్రమాదం ఉంది. నీరు అందుబాటులో లేనప్పుడు కీరాను తీసుకుంటే అది శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది. ఇందులో అధిక నీరు, తక్కువ క్యాలరీలు ఉండడం వలన జీర్ణక్రియ సాఫీగా కొనసాగటానికి దోహదపడుతుంది.
 
అలసిన కళ్లకు కీరా అద్భుతంగా పనిచేస్తుంది. కీరను గుండ్రంగా కట్‌చేసి కళ్లపై వేసుకోవడం ద్వారా కళ్లకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కళ్లక్రింద ఏర్పడే ఉబ్బులను, నల్లటి వలయాలను నివారిస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్త సరఫరా సాఫీగా కొనసాగుతుంది. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తికి అవసరమైన హార్మోను ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కీరాను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
కీళ్లనొప్పులను తగ్గించుటకు కీరా చాలా ఉపయోగపడుతుంది. కీరా రసాన్ని తీసుకోవడం ద్వారా కడుపులోని మంటను తగ్గించుకోవచ్చును. శరీరంలో ఏర్పడే మలినాలను బయటకు పంపుతుంది. పచ్చికీరాను నమిలి తినడం ద్వారా నోటీ దుర్వాసన నుండి విముక్తి పొందువచ్చును.