1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (12:18 IST)

మెుక్కజొన్న తీసుకుంటే లాభాలేమిటో తెలుసా?

వేసవి కాలం ముగిసి ఇప్పుడిప్పుడే చినుకులు మొదలయ్యాయి. సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రటి నిప్పులపై కాల్చిన మెుక్కజొన్న పొత్తుతింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శక్తివంతమైన పోషకాలు, ఖనిజాలతో పాటు ఎ, బి, సి ఇ విటమిన్స్ లభిస్తాయి. మెుక్కజొన్నలో పాంటోథై

వేసవి కాలం ముగిసి ఇప్పుడిప్పుడే చినుకులు మొదలయ్యాయి. సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రటి నిప్పులపై కాల్చిన మెుక్కజొన్న పొత్తుతింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శక్తివంతమైన పోషకాలు, ఖనిజాలతో పాటు ఎ, బి, సి ఇ విటమిన్స్ లభిస్తాయి. మెుక్కజొన్నలో పాంటోథైనిక్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
 
ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, మెులల సమస్యలతో పాటు పేగు క్యాన్సర్‌ను కూడా అరికడుతుంది. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుంది. మెుక్కజొన్నలో ఉండే విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ రక్తహీనత సమస్యలను దూరంచేస్తాయి. 
 
ఇది రక్తంలోని ఎర్రరక్తకణాల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి రక్తసరఫరా వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు, పక్షవాతం, బి.పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మెుక్కజొన్న శరీరపు ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది.
 
మెుక్కజొన్నలో ఖనిజాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పాస్పరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నిషియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే మెదడు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు తమ డైట్‌లో మెుక్కజొన్నతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చును. 
 
అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. విటమిన్ బి హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుంది. తాజా అధ్యాయనాల ప్రకారం ఆల్జీమర్స్, మధుమేహం, బి.పి. హృద్రోగాలనూ నివారించడంలో మెుక్కజొన్న ఎంతగానో ఉపయోగపడుతుంది.