ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (13:45 IST)

కొబ్బరి పాలు తీసుకుంటే..?

కొబ్బరి పాలు తీసుకుంటే వీర్యవృద్ధి అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు రక్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కొబ్బరి పువ్వు లో

కొబ్బరి పాలు తీసుకుంటే వీర్యవృద్ధి అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు రక్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కొబ్బరి పువ్వు లోపల చిన్న కరక్కాయ లాంటి పరిమాణంలో వున్న దాన్ని రెండు పూటలా పెరుగుతో కలిపి సేవిస్తే.. మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
 
అలాగే కొబ్బరి నూనెను మధుమేహం వల్ల కాళ్ల మంటలు, తిమ్మిర్లు, స్పర్శ తగ్గి మొద్దుబారిపోతే లేపనంగా రాస్తే సరిపోతుంది. అలాగే కొబ్బరి నూనెతో తయారయ్యే వంటల్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. శరీర హార్మోన్ల స్థాయిల అసమతుల్యత వలన చాలామందిలో శరీర బరువు పెరిగిపోతారు.
 
హార్మోన్ల అసమతుల్యతల వలన థైరాయిడ్ గ్రంధి విధిలో లోపాలు ఏర్పడి, మానసిక ఆందోళన, జీవక్రియలో అవాంతరాలు ఏర్పడతాయి. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు హార్మోన్ల స్థాయిలను స్థిమితంగా ఉంచి, ఆందోళనను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.