శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (11:49 IST)

వేసవిలో దొరికే నేరెడు పండ్లను వాళ్లు మాత్రం తినకూడదు...

నేరెడు పండును వేసవికాలపు పండుగా చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరెడు పండు దూరంచేస్తుంది. నేరెడు పండు, ఆకులు, చెట్టు బెరడు కూడా

నేరెడు పండును వేసవికాలపు పండుగా చెబుతారు. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరెడు పండు దూరంచేస్తుంది. నేరెడు పండు, ఆకులు, చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.
 
ఈ పండులో సోడియం, పోటాషియం, క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ, సితో పాటు రైబోప్లెలిన్, పోలిక్ యాసిడ్లను సమృద్ధిగా కలిగిఉంటాయి. నేరెడు పండు షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట గోప్పవరం. మధుమేహంతో బాధపడేవారు ఈ గింజలను పొడిని చేసి నీటిలో కలిపి తీసుకుంటే శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. రక్తపోటు సమస్యలను తగ్గించుటకు సహాయపడుతుంది.
 
గుండెను ఆరోగ్యంగా చేయుటకు నేరెడు పండు చాలా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెట్స్ కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర  పోషిస్తాయి. రక్తంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. నేరెడు పండు తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చును.
 
ఇది దంతాలను, చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. కురుపులను పుండ్లగా చెప్పబడే మౌత అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం, వాంతి అయ్యేలా ఉండే లక్షణాలు తగ్గిస్తుంది.
 
మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలను దూరంచేస్తుంది. అనేక చర్మవ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను, లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది. పురుషులలో శృంగార శక్తిని పెంచుతుంది. పాలిచ్చే తల్లులు నేరెడు పండ్లకు దూరంగా ఉండడం మంచిది.